ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి బిగినింగ్ వెండితెరపై అలరించింది. బాహుబలి కంక్లూజన్ పేరుతో మరోసారి ఆశ్చర్యపరచడానికి సిద్దమవుతుంది. ఆ సినిమాతోనే మాహిష్మతి రాజ్యానికి, అభిమానులకు మధ్య ఉన్నఅనుబంధం తెగిపోదు. బాహుబలి అనేక రూపాల్లో అలరించబోతుంది.
ఇప్పటికే కామిక్ పుస్తకాల రూపంలో, యానిమేషన్ సిరీస్ గా వచ్చేందుకు సిద్దంగా ఉన్నది. ఇప్పుడు మరో రూపంలో కనువిందు చేయనుంది. బహుబలిని మొబైల్ గేమ్ గా తీసికోచ్చేందుకు ఆర్కా మీడియా భావిస్తుంది. ఇందుకు సంబందించిన పనులు మొదలయ్యాయి. ప్రముఖ గేమ్ డిజైనర్ మార్క్ స్కాగ్స్ తో కలసి రాజమౌళి చర్చలు జరిపారు.
0 Comments